హైద్రాబాద్ బోరబండలో దారుణం: ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

Published : Apr 24, 2023, 05:49 PM ISTUpdated : Apr 24, 2023, 06:22 PM IST
హైద్రాబాద్  బోరబండలో దారుణం: ప్రేమను నిరాకరించిందని  యువతి గొంతుకోసిన  ప్రేమోన్మాది

సారాంశం

హైద్రాబాద్ బోరబండలో దారుణం చోటు  చేసుకుంది.  ప్రేమను నిరాకరించిందని  యువతి గొంతుకోశాడు  నిందితుడు. 

హైదరాబాద్:  నగరంలోని  బోరబండలో  యువతి  గొంతు కోశాడు  కిషోర్  అనే యువకుడు. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానని   కిషోర్  వెంటపడుతున్నాడు.    బోరబండ పరిధిలో  బంజారా నగర్ లో  సోమవారంనాడు    కిషోర్   యువతి గొంతు కోశాడు.  తన ప్రేమను నిరాకరించిందని   యువతిన  గొంతుకోశాడు   కిషోర్.   కిషోర్ దాడిలో  యువతి  తీవ్రంగా గాయపడింది.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు యువతిని  ఆసుపత్రికి తరలించారు.   యువతిపై దాడికి పాల్పడిన   కిషోర్ ను   స్థానికులు పట్టుకొని దేహశుద్ది  చేశారు.  అనంతరం  అతడిని పోలీసులకు అప్పగించారు. 

ఈ దాడిలో యువతి  గొంతుపై,  చేతికి గాయాలయ్యాయి.   యువతికి  స్థానికంగా  ఉన్న  ప్రైవేట్ ఆసుపత్రిలో  ప్రాథమిక చికిత్స  చేశారు. మెరుగైన చికిత్స  కోసం   ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవాళ  సాయంత్రం  తాను  పనిచేసే కార్యాలయం నుండి స్కూటీపై  ఇంటికి వస్తున్న సమయంలో  కళ్లలో కారం కొట్టి  కత్తితో  కిషోర్ దాడికి దిగాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే