
Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇటీవల పాతబస్తీలో జరిగిన లాల్ దర్వాజ అమ్మవారి బోనాల వేడుకల్లో చికోటి ప్రవీణ్ అనుచరుడు తుపాకీ తేవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో చికోటి ప్రవీణ్ ను ఏ-1 గా పోలీసులు చేర్చారు. చికోటి ముగ్గురు గన్ మెన్స్ ను అరెస్ట్ చేసి.. అనుమతులు లేని గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. చికోటి ప్రవీణ్‌పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసులు పెట్టారు
అయితే.. ఈ కేసులో ఏ 1గా ఉన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్‌కు ఊరట దక్కింది. ఆయనకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. .