ఎంపీ అర్వింద్‌‌కి అసమ్మతి నేతల షాక్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హంగామా, కిషన్ రెడ్డి వార్నింగ్

Siva Kodati |  
Published : Jul 26, 2023, 09:50 PM IST
ఎంపీ అర్వింద్‌‌కి అసమ్మతి నేతల షాక్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హంగామా, కిషన్ రెడ్డి వార్నింగ్

సారాంశం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఇందూరుకు చెందిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.  తమకు తెలియకుండా మండల పార్టీ అధ్యక్షులను మార్చారని భగ్గుమన్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన దూకుడు పెంచారు. నేతలను కలుపుకుని వెళుతూ.. అధికార పార్టీపై పోరాటాన్ని ముమ్మరం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నేతల మధ్య సయోధ్య లేదు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఇందూరుకు చెందిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య ఇటీవల 13 మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అయితే స్థానిక నేతలకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా.. కొత్తవారికి అవకాశం ఇవ్వడం వెనుక ఎంపీ అర్వింద్ ప్రమేయం వుందని నేతలు భావించారు. 

అంతే బుధవారం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంల వద్ద ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివాదం పెద్దదవుతుందని గమనించిన పెద్దలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కొంత బలంగా వుంది. ఇక్కడి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు సిద్ధంగా వున్నారు. 

ALso Read: ఎంఐఎం పరోక్షంగా తెలంగాణను పాలిస్తోంది.. కిషన్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అర్వింద్ వర్గానికి చెందిన ధన్ పాల్ సూర్య నారాయణ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆసక్తి చేపుతున్నారు. ఆర్మూర్‌లో వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన రాకేశ్ రెడ్డి.. బోధన్ నుంచి ప్రకాశ్ రెడ్డి, మోహన్ రెడ్డిలు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మండలాల అధ్యక్షులను మార్చడం తీవ్ర కలకలం రేపింది. ఎంపీ అర్వింద్ చక్రం తిప్పి ఇలా చేశారంటూ అసమ్మతి నేతలంతా భగ్గుమన్నారు. అయితే ఎంపీ మాత్రం తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు.

వివాదం ముదిరి పరిస్థితులు చేయి దాటిపోకుండా కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. నేతలకు నచ్చజెప్పడంతో పాటు పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగినందుకు వార్నింగ్ ఇచ్చారు. వివాదాలేమైనా వుంటే కూర్చొని పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన వుందని.. అది ముగిశాక మాట్లాడుకుండామని వారందరికి నచ్చజెప్పి పంపేశారు కిషన్ రెడ్డి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?