పోలీసులపై దాడి:వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

By narsimha lode  |  First Published Apr 24, 2023, 10:20 PM IST

వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల  బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది  నాంపల్లి కోర్టు.   ఈ విషయమై  కౌంటర్ దాఖలు  చేయాలని కోర్టు ఆదేశించింది. 


హైదరాబాద్:వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎష్ షర్మిల  బెయిల్ పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది నాంపల్లి  కోర్టు.  మరో వైపు  కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది  నాంపల్లి  కోర్టు.

పోలీసులపై దాడి  కేసులో  వైఎస్ షర్మిలను  హైద్రాబాద్  జూబ్లీహిల్స్  సోమవారంనాడు  అరెస్ట్  చేశారు.   ఇవాళ సాయంత్రం  నాంపల్లి కోర్టులో ఆమెను  హాజరుపర్చారు పోలీసులు.   రిమాండ్ ను తిరస్కరించాలని  షర్మిల  తరపు న్యాయవాది  కోరారు.  కానీ  పోలీసులపై  షర్మిల దాడి  చేసిందని  పోలీసుల తరపు న్యాయవాది  వాదించారు.  ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత   కోర్టు  షర్మిలకు  14 రోజుల జ్యుడిసీయల్ రిమాండ్ విధించింది.   రిమాండ్  విధించడంతో పోలీసులు  వైఎస్ షర్మిలను   చంచల్ గూడ జైలుకు తరలించారు.  

Latest Videos

also read:పోలీసులపై దాడి: వైఎస్ షర్మిలకు మే 8 వరకు జ్యుడిషీయల్ రిమాండ్

ఇదిలా ఉంటే  కోర్టులో  షర్మిలకు బెయిలు కోరుతూ  ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  విచారణను  రేపటికి వాయిదా వేసింది  కోర్టు. మరో వైపు  కౌంటర్ దాఖలు  చేయాలని   పోలీసులను  కోర్టు ఆదేశించింది. రేపు ఉదయం  11 గంటలకు   విచారణ నిర్వహిస్తామని  కోర్టు తెలిపింది. 
 

click me!