Nama Nageswara Rao Biography: జాతీయస్థాయి రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుడు నామా నాగేశ్వర రావు . ఇప్పటికే రెండుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకీ ఆయన వ్యక్తిగత , రాజకీయ జీవిత ప్రస్థానమేంటో తెలుసుకుందాం.
Nama Nageswara Rao Biography: జాతీయస్థాయి రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుడు నామా నాగేశ్వర రావు . ఇప్పటికే రెండుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకీ ఆయన వ్యక్తిగత , రాజకీయ జీవిత ప్రస్థానమేంటో తెలుసుకుందాం.
బాల్యం, కుటుంబం
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖమ్మంలోక్సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు నామా నాగేశ్వర్ రావు. ఆయన 1957 మార్చి 15న మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం బలపాల గ్రామంలో నామ ముత్తయ్య వరలక్ష్మి దంపతులకు జన్మించారు. నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.
రాజకీయ జీవితం
నామా నాగేశ్వర రావు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. ఆయన మొదటి సారి 2004లో టీడీపీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక చౌదరి పై పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తిరిగి 2009లో రేణుక చౌదరి పోటీ సుమారు లక్ష 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అలా తొలిసారి నామా నాగేశ్వర రావు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అలాగే.. లోక్‌సభలో తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడిగా ఆయన నియమితులయ్యారు. అదే విధంగా పబ్లిక్ అండర్‌టేకింగ్స్, రవాణా, పర్యాటకం, సాంసృతిక కమిటీలలో సభ్యుడిగా నియమితులయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గ నుంచి పోటీ చేసిన నామా 11 వేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ పరిణామంతో 2019, మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అదే సంవత్సరం అంటే.. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభ జీవితం..
నాగేశ్వరావు రాజకీయాల్లోకి రాకముందు విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు. పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్గతంగా మాట్లాడగల ఆయన కాశ్మీర్ ఏర్పాటు వాదులతో చర్చించడానికి పార్లమెంట్ నుంచి వెళ్ళిన అఖిలపక్ష బృందంలో ఆయన ఒకరు. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో తెలిపిన సమాచారం ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు 173 కోట్లు.
రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేస్తే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రజల సమస్యలపై కేంద్రంతో పోరాడి ఎంజిఎన్ఆర్ఈజీఎస్, సెంట్రల్ జాతీయ రహదారులు కొరకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకున్నారు. కరోనా సమయంలో కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు.
నామా నాగేశ్వర రావు బయోడేటా..
పూర్తి పేరు: నామా నాగేశ్వర రావు
పుట్టిన తేదీ: 15 Mar 1957 (వయస్సు 67)
పుట్టిన ప్రాంతం: బలపాల, తెలంగాణ
పార్టీ పేరు :
వృత్తి: వ్యాపారం
తండ్రి పేరు: ముత్తయ్య
తల్లి పేరు : నామా వరలక్ష్మీ
జీవిత భాగస్వామి: నామా చిన్నమ్మ