Koppula Eshwar Biography: సింగరేణి కార్మికుల నుంచి ప్రభుత్వ చీఫ్ వరకు ఎదిగిన ప్రజ్ఞాశాలి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం..
Koppula Eshwar Biography: ఉద్యోగంలోనూ.. రాజకీయ ప్రస్థానంలోనూ నమ్ముకున్న సూత్రాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదని నాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం.. నమ్మిన వ్యక్తి కోసం.. ఎంతటి కష్టానైనా ఇష్టంగా స్వీకరించే నేత. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచే క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు.
ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యంగా.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా నేత. సింగరేణి కార్మికుల నుంచి ప్రభుత్వ చీఫ్ వరకు ఎదిగిన ప్రజ్ఞాశాలి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం..
కొప్పుల ఈశ్వర్ బాల్యం, విద్యాభ్యాసం
పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామంలో 1959 ఏప్రిల్ 24న మల్లమ్మ - లింగయ్య దంపతులకు జన్మించారు కొప్పుల ఈశ్వర్. ఆయన తన తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో సెటిల్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ చదువు మొత్తం గోదావరిఖనిలో సాగింది. బిఏ డిగ్రీ వరకు చదువుకున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుడిగా 27 సంవత్సరాలపాటు పని చేశారు. ఉద్యోగం చేస్తున్న ఎక్కడో చిన్న అసంతృప్తి తన చుట్టూ ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండవలసి వస్తుంది . గడిచిపోతున్న ఆయనను రాజకీయాల వైపు అడుగులు వేయించింది
రాజకీయ ప్రవేశం
1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో కొప్పుల ఈశ్వర్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తారు. తన అభిమాన నేత పెట్టిన టీడీపీ పార్టీలో చేరి.. ఎస్సీసెల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేడారం శాసనసభ నియోజకవర్గ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
మాతంగ్ నర్సయ్య పదవీ విరమణ చేయడంతో 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థిగా మేడారం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గారి గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో ధర్మపురి నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
ఇలా 2004 నుంచి 2018 వరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలుపుకొని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల సాధించారు. కానీ, 2023లో జరిగిన తెలంగాణ శాసససభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఓటమి పాలయ్యారు. అయితే.. మాజీ సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
స్వీకరించిన పదవులు
>> సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 26 ఏళ్లపాటు పనిచేసిన ఆయన 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేశారు.
>> షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, BC సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ మంత్రిత్వ శాఖలలో సేవలందించారు.
>> 2019 నుంచి 2023 వరకు కేసీఆర్ కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
కొప్పుల ఈశ్వర్ బయోడేటా..
పేరు: కొప్పుల ఈశ్వర్
జననం: 20 ఏప్రిల్ 1959
స్వస్థలం:గోదావరిఖని.
రాజకీయ పార్టీ: బీఆర్ఎస్
తల్లిదండ్రులు: కొప్పులమల్లమ్మ - లింగయ్య
నివాసం: కరీంనగర్
వెబ్సైట్: https://koppulaeshwar.officialpress.in/