ఆయన ఓ గర్నమెంట్ హాస్పిటల్ కు సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్నారు. కానీ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నల్లగొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావుడ్యా లచ్చు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండంగా రెడ్ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు. నల్లగొండలోని ఆయన ఇంట్లోనే మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న (ఫిర్యాదుదారుడు)కు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేశారు.
మంచి నిర్ణయమే.. కానీ చాలా లేటైంది - అసదుద్దీన్ ఒవైసీ
undefined
ఫిర్యాదుదారుడైన వెంకన్న నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కు మెడిసిన్, హాస్పిటల్ సామగ్రిని సరఫరా చేసే మెడికల్ డిస్ట్రిబ్యూటర్. అయితే ఆయనకు మేలు చేసినందుకు గాను సూపరింటెండెంట్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్
నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ లచ్చు నాయక్ హాస్పిటల్‌కు మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల లంచం డిమాండ్ చేసాడు.
ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న ఈరోజు డబ్బులు… pic.twitter.com/bubZuOFIN0
దీంతో శుక్రవారం (నేడు) ఉదయం 8.40 గంటలకు నల్లగొండలోని డాక్టర్ లావుడ్యా లచ్చు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించింది. ఆయన బ్యాగులో ఉన్న లంచం డబ్బులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన రెండు చేతులపై ఫినాలాఫ్తలిన్ చల్లినప్పుడు పాజిటివ్ రిజల్స్ వచ్చాయి.
మహాలక్ష్మి ఎఫెక్ట్.. బస్సుల్లో సీట్ల అమరికను మార్చేసిన ఆర్టీసీ.. ఎందుకో తెలుసా ?
తరువాత సోడియం కార్బోనేట్ అప్లయ్ చేసినప్పుడు గులాబీ రంగులోకి మారడంతో డబ్బు తీసుకున్నట్టు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసి త్వరలోనే ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.