అల్లుడికి హమీ ఇచ్చారు, ఆ సీటు నాకే కావాలి: నాయిని

By narsimha lodeFirst Published Oct 8, 2018, 6:21 PM IST
Highlights

ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును నాకే ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతానని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు


హైదరాబాద్:ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును నాకే ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతానని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.

సోమవారం నాడు  ఓ తెలుగున్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  మాట్లాడారు. ముషీరాబాద్  టీఆర్ఎస్ టిక్కెట్టును నా అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇస్తానని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన గుర్తుచేశాడు. అయితే  ముషీరాబాద్ టిక్కెట్టు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వకపోతే తన టిక్కెట్టు తనకే  ఇవ్వాలని  కేసీఆర్ ను కోరననున్నట్టు నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.

ముషీరాబాద్  అసెంబ్లీ స్థానం నుండి  అవసరమైతే తానే బరిలోకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6 వతేదీన కేసీఆర్  ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో  ముషీరాబాద్ స్థానం నుండి  అభ్యర్థిని ప్రకటించలేదు. 

ఈ స్థానం నుండి  నాయిని నర్సింహ్మరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి తో పాటు స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు కూడ టిక్కెట్టు కోసం   పట్టుబడుతున్నారు.  ఈ కారణంగా  ముషీరాబాద్ నుండి పోటీచ ేసే అభ్యర్థి పేరును ప్రకటించలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

click me!