నా ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది:పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు

By Nagaraju TFirst Published Oct 8, 2018, 5:59 PM IST
Highlights

తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ ఖాతా‌ హ్యాకింగ్‌కు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేశారని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ కు వివరించారు. 

హైదరాబాద్‌: తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ ఖాతా‌ హ్యాకింగ్‌కు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేశారని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ కు వివరించారు. 

తనకు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా 5లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. అక్టోబర్‌ 2న ఓ సారి హ్యాకింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారని..7న హ్యాక్‌ చేశారని రాజాసింగ్‌ పోలీసులకు వివరించారు. 

ఫేస్‌బుక్‌ హ్యాక్‌ వెనుక ఎంఐఎం నేతలు ఉన్నట్లు రాజాసింగ్ ఆరోపించారు. గోషామహల్‌ నుంచి తనని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

click me!