ఎమ్మెల్యేలైతే వ్యాపారాలు చేయవద్దా?: ఐటీ దాడులపై ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 15, 2023, 11:26 AM IST

ఐటీ సిబ్బందికి సమాచారం  ఇస్తున్నా  కూడ  ఐటీ అధికారులు  బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా సమాచారం అందిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  ఆరోపించారు.
 


హైదరాబాద్: ఎమ్మెల్యేలైతే వ్యాపారాలు చేయవద్దా  అని  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి  ప్రశ్నించారు. గురువారంనాడు  ఉదయం  తన నివాసం వద్ద  మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్నటి నుండి  తన నివాసంలో ఐటీ అధికారులు  సోదాలు  నిర్వహిస్తున్నారన్నారు.  ఐటీ అధికారులు  ఎక్కడెక్కడ  సోదాలు  చేస్తున్నారో తనకు  తెలియదన్నారు.  తమ  సంస్థల్లో  పనిచేస్తున్న  ఉద్యోగులపై  ఐటీ అధికారులు  బూతులు తిట్టడమే కాకుండా  చేయి చేసుకున్నారని  సమాచారం అందిందన్నారు.ఈ విషయమై నిజమైతే  ఐటీ అధికారుల సంగతి తేలుస్తామని  మర్రి జనార్ధన్ రెడ్డి  హెచ్చరించారు.  తనిఖీలు  చేయడానికి  వచ్చి  ఉద్యోగులపై  దాడి  చేయడం సరైంది కాదన్నారు. 

భువనగరి ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి  వ్యాపారం  చేస్తున్నారని  మీడియా అడిగిన  ప్రశ్నకు  మర్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు.   ఎమ్మెల్యేలైతే  వ్యాపారాలు చేయవద్దా అని ఆయన అడిగారు.   మోడీ రాజ్యాంగంలో   ఇది ఉందా అని  ఆయన  ప్రశ్నించారు.  తమ సహనాన్ని  ఐటీ అధికారులు  పరీక్షించొద్దన్నారు.

Latest Videos

undefined

also read:హైద్రాబాద్‌లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో రెండో రోజూ తనిఖీలు

ఇప్పటికే  తాను  రూ. 150 కోట్లను  ఆదాయపన్ను శాఖకు   ట్యాక్స్ కింద చెల్లించామన్నారు. ప్రస్తుతం  సోదాలు  ముగిసిన  తర్వాత తాను కడిగిన  ముత్యంలా  బయటకు వస్తానని ఆయన ధీమాను వ్యక్తం  చేశారు. గతంలో తనకు  ఐటీ శాఖ నుండి  అవార్డు  వచ్చిన విషయాన్ని మర్రి జనార్ధన్ రెడ్డి  గుర్తు  చేశారు.ఐటీ శాఖ అధికారులు  తమ సెల్ ఫోన్లను  స్వాధీనం చేసుకున్నారని  మర్రి జనార్ధన్ రెడ్డి  చెప్పారు. సోదాలు  ముగిసిన తర్వాత  తాను  స్టేట్ మెంట్  ఇస్తానన్నారు. 

click me!