చేనేత బట్టలేస్తే .. చెరువు కబ్జా మరుస్తారా

First Published Jan 8, 2017, 9:44 AM IST
Highlights

నాగార్జున తెలంగాణ ఖాదీ వస్త్రాలు ధరిస్తే ఆహా...ఓహో అంటున్న ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణ నడిబొడ్డున ఉన్న చెరువును చెరబట్టి ఎన్ కన్వెన్షన్ ను కట్టినప్పుడు ఎందుకు నిలదీయడం లేదన్నదే తెలంగాణ వాదుల ప్రశ్న.


సినీ నటుడు నాగార్జున మాంఛి నటుడే కాదు అంతకు మించిన వ్యాపారవేత్త... అంతకుమించి లౌక్యం తెలిసిన బిజినెస్ మెన్.

 

ఆయన ఏ పార్టీలకు సపోర్టు చేయరు కానీ అధికార పార్టీకి మాత్రం కాస్త దగ్గరగానే ఉంటారు.

 

నాటి సమైక్య ఆంధ్రలోనైనా.. నేటి సపరేటు తెలంగాణలోనైనా అలా ఉండడం వల్లే నాగ్ కు బాగా ‘కలసివస్తోంది‘.

 

ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాల వాడకంపై విసృతంగా ప్రచారం చేస్తున్నారు.
 

 

దీనికి సెలబ్రెటీలు కూడా బాగానే స్పందిస్తున్నారు. తాము చేనేతకు చేయూత నిస్తామని ట్వీట్లతో హామీ ఇస్తున్నారు.

 

సినీ నటుడు నాగార్జున అయితే ఏకంగా అమలతో కలసి చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోను ట్విటర్లో పెట్టి చేనేతపై తనకున్న మమకారాన్ని... ముఖ్యంగా తెలంగాణ చేనేత వస్త్రాలపై ఉన్న తన ఇష్ట్రాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేశారు.

దీంతో కేటీఆర్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. నాగ్ ప్రయత్నం మరెంతోమందికి స్ఫూర్తిదాయకమని రిట్వీట్ కూడా చేశారు. ఇలా ట్విటర్ వేదికగా ఒకరికొకరు బాగానే ప్రశంసపత్రాలను ఇచ్చుకున్నారు.

 

నాగార్జున చేనేతకు చేయూతనివ్వడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.

 

అదే సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున్న చెరువును చెరబట్టి ఎన్ కన్వెన్షన్ ను కట్టి కోట్లుకొల్లగొడుతున్న విషయం ఎప్పటి నుంచి వివాదంగా ఉంది.

 

దీనిపై సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా.

 

 

దీనిపై కూడా కేటీఆర్ ఒసారి నాగ్ ను అడిగితేబాగుండేదేమో... ఎందకంటే అసెంబ్లీలో కూడా సాధ్యంకాని కొన్ని పనులు ఈ మధ్య ట్విటర్ మాటలతో సాధ్యంమవుతున్నాయి.

 

 

 

 

 

 

click me!