కాంగ్రెస్ నేతల్లో విభేదాలు! బీసీలను రేవంత్ అవమానించాడు, బుద్ధి చెప్తాం: నాగం.. ‘జూపల్లిని ఓడిస్తా..’

By Mahesh K  |  First Published Oct 16, 2023, 7:52 PM IST

కాంగ్రెస్ విడుదల చేసిన 55 మంది అభ్యర్థుల జాబితాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన మాజీ మంత్రి జూపల్లికి కొల్లాపూర్ స్థానం నుంచి బరిలోకి దింపుతానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌లో అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర రావు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు సంధించారు.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. వివాదాలు లేని స్థానాలనే ప్రధానంగా ఈ లిస్టులో కాంగ్రెస్ చేర్చింది. అయినా.. పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడుతున్నది. కొన్ని చోట్లా తారాస్థాయిలో ఈ ఆగ్రహం పెల్లుబుకుతున్నది. నాగర్‌కర్నూలు జిల్లాలో కొందరు అసమ్మతి నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగం జనార్ధన్ రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూపల్లి కృష్ణారావుపై విరుచుకుపడ్డారు.

నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో న్యాయంగా పని చేసిన వారికి అన్యాయం చేశారని ఆయన పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. జూపల్లి వట్టి అవకాశవాది అని, కోవర్టు అని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలువకపోతే ఆయన పార్టీలోకి వచ్చేవారేనా? అని ప్రశ్నించారు. జూపల్లి గెలిచిన తర్వాత పార్టీ మారబోనని మాట ఇచ్చారా? అని పార్టీ నాయకత్వానికి ప్రశ్నలు వేశారు. పొన్నాల లక్ష్మయ్య పై నోరుపారేసుకుని రేవంత్ రెడ్డి బీసీలను అవమానించారని అన్నారు. టికెట్లు ఇవ్వకుండా అవమానించారని, కాబట్టి, తాము తగిన బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, పార్టీలో అన్యాయం జరిగిన అభ్యర్థులందరికీ అండగా ఉంటామని అన్నారు. 

Latest Videos

undefined

Also Read: మ్యానిఫెస్టో లేకుండానే బరిలోకి.. ఐనా విజయాలు.. ఈ సారి కూడా ఆ పార్టీది ఇదే దారి?

చింతలపల్లి జగదీశ్వర రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తమను మోసం చేశారని, తాము జూపల్లిని ఓడించి బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. తాను జూపల్లిపై కొల్లాపూర్ స్థానంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని, జూపల్లిని ఓడిస్తానని అన్నారు. జూపల్లి తాను తినే అన్నంలో మట్టి పోశారని ఆగ్రహించారు.

click me!