
నోట్ల రద్దుతో వెండితెర వెలుగు అంతా పోయిన వేళ... థియేటర్లన్నీ ఖాళీ కుర్చీలతో దర్శమిస్తున్న వేళ.. జనమంతా రోజు గడవడానికి నానా కష్టాలు పడుతున్న వేళ..
అన్న మెగా స్టార్ అవేవి పట్టించుకోకుండా షూటింగ్ లో బిజీగా గడిపేస్తుండగా.. తమ్ముడు పవర్ స్టార్ పాచిపోయిన ట్వీట్ ఒకటి వదిలి ఇక చాలు అనుకుంటూ ఉండగా ...
టవర్ స్టార్ నాగుబాబు మాత్రం జబర్ధస్త్ స్టేట్ మెంట్ తో రియల్ స్టార్ అనిపించుకున్నారు.
పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మేరకు యూట్యూబ్ లో ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేశారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ భవిష్యత్ మారుతుందని విశ్వసిస్తున్నట్ల చెప్పారు.
https://www.youtube.com/watch?v=v6qzZcVECuM
70 ఏళ్ల స్వతంత్ర భారత్ లో ఒక ప్రధాని తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఈ విషయాన్ని అభివర్ణించారు.
ప్రధానిగా మోదీ ఈ ప్రకటనతో చరిత్రలో నిలిచారని కొనియాడారు. దేశంలో ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలబడిన ప్రజలు.. పెద్ద నోట్ల రద్దుపై అసహనం వ్యక్తం చేయడం సమంజసంగా లేదన్నారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
వచ్చే ఎన్నికలలోపు రూ.2 వేల నోటును కూడా రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు.
అప్పడే ఎన్నికలు పాదర్శకంగా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా మోదీ నిర్ణయాన్ని స్వాగతించి సహకరించాలని కోరారు.
ఇదంతా బాగానే ఉంది.. కానీ, మెగా అభిమానులకే ఈ స్టేంట్ మెంట్ సరిగా అర్థం కావడం లేదు. అన్న మాట్లాడడు.. తమ్ముడు తటపటాయిస్తూ ట్వటర్ లో మాత్రమే కూస్తాడు.
ఇక ఏ స్టేట్ మెంట్ ను ఫాలో కావాలో తెలియక అభిమానులు ‘మెగా’ కన్ఫ్యూజన్ లో పడిపోయారు.