
గుంటూరు : కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు ప్రత్యక్షమవడం గుంటూరు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణానది ఒడ్డున నాగ ప్రతిమలను స్థానికులు గుర్తించారు. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అనే సందేహలు స్థానికుల్లో మెదులుతున్నాయి. ఎవరైనా తీసుకువచ్చి పెట్టారా లేక నదిలో కొట్టుకువచ్చాయా అనేది తెలీయడంలేదని సీతానగరం వాసులు అంటున్నారు.
కృష్ణా నది ఒడ్డునగల విగ్రహాలు పురాతన కాలానికి చెందినవేమో లేదంటే ఎక్కడయినా గుడులు కూల్చివేసి ఈ విగ్రహాలకు ఇక్కడ తెచ్చి పడేసారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నారు. లేదంటే ఎవరైనా శిల్పులు డ్యామేజ్ విగ్రహాలను తెచ్చి పడేసారేమోనని మరికొందరు అంటున్నారు. ఎలావచ్చాయో తెలీదుగానీ భారీగా నాగ విగ్రహాలు కృష్ణానదీ తీరానికి చేరాయి.
నాగ ప్రతిమలు కావడంతో ఏమయినా దోషం వుంటుందేమోనని సీతానగరం ప్రజలు భయపడుతున్నారు. దోషం చుట్టుకోకుండా వుండేందుకే విగ్రహాలను వదిలివెల్లివుంటారని... ఆ దోషం ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
కృష్ణానదీ తీరంలోని నాగవిగ్రహాలు ఎక్కడినుంచి వచ్చాయి... వాటికేమైనా చరిత్ర వుందేమో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరగాల్సి వుందని స్థానికులు అంటున్నారు.ఒడ్డునే కాదు నదిలోనూ మరిన్ని విగ్రహాలు వుండివుంటాయని అంటున్నారు. వాటిని కూడా బయటకు తీసి వాటి చరిత్రేమిటో తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.