కొందరు కావాలని చేస్తున్నారు... చట్టాన్ని ఉల్లంఘించలేదన్న అక్బరుద్దీన్

By Siva KodatiFirst Published Jul 26, 2019, 6:11 PM IST
Highlights

తన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టి ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని... కానీ తాను చట్టంలోని ఏ నిబంధనను ఉల్లంఘించలేదని అక్బరుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు

కరీంనగర్‌లో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తన ప్రసంగంలో ఎటువంటి అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన ప్రకటన ఇవ్వలేదని..తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని కించపరచలేదన్నారు.

కానీ కొంతమంది వ్యక్తులు వారి రాజకీయ స్వార్థం కోసం అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టి ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని... కానీ తాను చట్టంలోని ఏ నిబంధనను ఉల్లంఘించలేదని అక్బరుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా బుధవారం కరీంనగర్‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఓవైసీ మాట్లాడుతూ.. మృత్యువు తనను ఏ క్షణమైనా పలకరించవచ్చన్నారు.  

ఎక్కువకాలం బతకనని డాక్టర్లు చెప్పారని.. కానీ మరణం గురించి తనకు బాధ లేదని.. నాకున్న బాధంతా ఒక్కటే.. కరీంనగర్‌లో బీజేపీ బలపడటం.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అధ్యర్ధి గెలవడం తనకు బాధ కలిగించిందని అక్బరుద్దీన్ అన్నారు.

కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు బీజేపీకి అడ్రస్ కూడా లేదు.. కానీ ఇప్పుడు ఏకంగా ఎంపీ స్థానాన్నే గెలుచుకోవడం ఆవేదనగా ఉందన్నారు.

ఎంఐఎం గెలవకపోయిన ఫర్వాలేదు.. బీజేపీ గెలిపించొద్దని ఆయన పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా పలు పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. 

వైద్యులు చెప్పారు, ఏ క్షణమైనా నేను పోవచ్చు: అక్బరుద్దీన్

click me!