దివ్యాంగుడికి త్రిచక్రవాహనం అందించిన కేటీఆర్

Siva Kodati |  
Published : Jul 26, 2019, 03:21 PM IST
దివ్యాంగుడికి త్రిచక్రవాహనం అందించిన కేటీఆర్

సారాంశం

గల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు పొగొట్టుకున్న దివ్యాంగుడికి త్రిచక్ర వాహనాన్ని అందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. 

గల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు పొగొట్టుకున్న దివ్యాంగుడికి త్రిచక్ర వాహనాన్ని అందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి సాగర్ అనే యువకుడు ఉపాధి కోసం కొద్దిరోజుల కిందట దుబాయ్ వెళ్లాడు.

అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సాగర్ తన కుడికాలును కోల్పోయాడు. కోలుకున్న తర్వాత స్వగ్రామానికి చేరుకుని చిన్న కిరాణా కొట్టు ద్వారా జీవనం సాగిస్తున్నాడు. అయితే తన జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు తన అంగవైకల్యం అడ్డుగా వస్తున్న విషయాన్ని సాగర్.. ట్వీట్టర్ ద్వారా కేటీఆర్‌కు తెలిపాడు.

ఈ విషయం స్థానిక టీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి తెలియడంతో ఆయన దాతృత్వంతో సాగర్‌కు త్రిచక్ర వాహనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ చేత సాగర్‌కు త్రిచక్ర వాహనాన్ని బహూకరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాగర్ జీవనోపాధి కోసం అవసరమైన సాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?