
అహ్మమదాబాద్ లోని సబర్మతి నదిని అభివృద్ది పరచడం ద్వారా ఎర్పాటు చేసిన సబర్మతి రివర్ డెవెలప్మెంట్ ప్రంట్‌ను మంత్రి కెటిరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖకార్యదర్శి నవీన్ మిట్టల్, GHMC,HMDA కమీషనర్లు, HMWSSB యండి ఇతర అధికారులు సందర్శించారు.
మూసీ అభివృద్ది, సుందరీకణ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న నేపథ్యంలో సబర్మతి నది అభివృద్ది నమూనాను అధ్యయనం చేశారు. ఇందుకోసం రివర్ ప్రంట్ అధికారులు మంత్రి బృందానికి వివరాలు అందజేశారు.
సుందరీకణ కోసం ఏదురైన సమస్యలు, నదీ ఒడ్డున అప్పటి దాకా ఉన్న జనావాసాలు తరలింపు, మెత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విజన్, ప్రజల సహాకారంతోనే ఈ ప్రాజెక్టు విజయం సాధించిందని తెలిపారు.
ఈ రివర్ ప్రంట్ అహ్మదాబాద్ పట్టణానానికి ఒక తలమానీకంగా నిలిచిందని, ఇదే స్థాయిలో మూసినదిని అభివృద్ది చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని మంత్రి తెలిపారు.
సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్స్ వేలు, పార్కులు, రోడ్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్శన అనుభవం ఖచ్చితంగా మూసి నదీ సుందరీకరణకు ఉపయోగపడుతుందన్నారు.