17మంది మహిళల్ని చంపిన నరహంతకుడికి జీవితఖైదు..కల్లు, మద్యం తాగేవారే టార్గెట్..

Published : May 27, 2022, 08:32 AM IST
17మంది మహిళల్ని చంపిన నరహంతకుడికి జీవితఖైదు..కల్లు, మద్యం తాగేవారే టార్గెట్..

సారాంశం

17మంది అమాయక మహిళల్ని కిరాతకంగా హతమార్చిన ఓ నరహంతకుడికి మహబూబ్ నగర్ కోర్టు జీవితఖైదు విధించింది. 

మహబూబ్ నగర్ : Mahabubnagar లో ఓ నర హంతకుడికి గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఒకటి కాదు... రెండు కాదు... మొత్తం 17 మంది మహిళను అతి దారుణంగా murder చేసిన చరిత్ర నిందితుడికి ఉంది. కల్లు, మద్యం తాగే womenలే లక్ష్యంగా పెట్టుకుని వారిని నమ్మించి.. హత్యలు చేసేవాడు. వారి ఒంటిపై బంగారం, వెండి నగలు కనబడితే చాలు… మాటల్లో పెట్టి. నమ్మించేవాడు. ఆ తరువాత తనతో పాటు నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న వారిని కిరాతకంగా మట్టుపెట్టేవాడు. ఆ తరువాత ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయేవాడు. షాకింగ్ విషయం ఏమంటే సొంత తమ్ముడినే చంపాడన్న కేసులోనూ నిందితుడు. 2019 డిసెంబర్ 17న మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో.. నవాబ్ పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ(53) మృతదేహాన్ని గుర్తించారు.

క్లూస్ టీం ఇచ్చిన సమాచారంతో ఆమె హత్య కేసులో పాత నేరస్తుల పాత్ర ఉందనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు పలువురిని విచారించారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడుకు చెందిన ఎరుకలి శ్రీను(47)ను  అనుమానించి విచారించగా బండారం బయటపడింది. ఆ తర్వాత కి అతడిని అరెస్ట్ చేసి  రిమాండ్ కు తరలించారు. గద్వాల కోర్టులో విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ గద్వాల మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి శివ కుమార్  గురువారం తీర్పునిచ్చారు.  దీంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

జీవితమంతా నేర చరిత్రే..
2007లో  సొంత తమ్ముడిని హత్య చేసి జైలుకు వెళ్ళాడు. జైలు నుండి బయటకు వచ్చాక.. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్ లకు తాగడానికి వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత పలుసార్లు జైలుకు వెళ్లి విడుదల అవుతూ వస్తున్నాడు.  చివరిసారిగా 2018 ఆగస్టులో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత అధికారులు అతనిలో మార్పు వస్తుందని  జిల్లా జైలులోని పెట్రోల్ బంకులో ఉపాధి చూపించారు. సరిగా విధులకు హాజరు కాకపోవడంతో విధుల నుంచి తొలగించారు.

జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తే మళ్లీ విధుల్లోకి చేర్చుకున్నారు. తర్వాత కూడా విధులకు సరిగా హాజరు కాలేదు. ఆ సమయంలోనే జిల్లాలోని మిడ్జిల్,,  బూత్ పూర్,  దేవరకద్ర,  కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు చేశాడు.  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో టీఎస్ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ ఎముకల గూడు లభించింది. ఈ హత్యను ఎరుకలి శ్రీను చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే సమయంలో దేవరకద్ర హత్య బయటపడింది. అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు పడిందని దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices: ట‌మాట డ‌బుల్‌, సెంచ‌రీ కొట్టిన అల్లం.. హైద‌రాబాద్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.
Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu