సిద్ధిపేట జిల్లాలో ఆటో, లారీ ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి...

Published : May 27, 2022, 06:36 AM IST
సిద్ధిపేట జిల్లాలో ఆటో, లారీ ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి...

సారాంశం

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. 


సిద్ధిపేట : Siddipet జిల్లా జగదేవ్పూర్ మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఘోర road accident జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలు మెదక్ వెళ్తోంది.  ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ alirajpet వద్ద ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.  మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 

ఇదిలా ఉండగా, నిన్న ఏపీలోని మదనపల్లెలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం.  కారు కల్వర్టును ఢీకొనడంతో.. కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. 

క్రిష్ణాజిల్లాలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే.. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు  బయలుదేరింది. అయితే, వారు ప్రయాణిస్తున్న వాహనం.. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మీద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరకుని  సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  గాయపడిన వారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 

ఇక, ప్రమాదం జరిగిన సమయంలో  పెళ్లి బృందం వాహనంలో 20 మందికి పైగా  ఉన్నారు. పరిమితికి మించి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల 16న అన్నమయ్య జిల్లా కురబలకోట మంలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిమీద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మదరనల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెల్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోసట్ుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ ఢీ కొట్టడంతో బైక్ మీద వెడుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందినట్లు వివరించారు. కాగా, ఈ ఘటనలో బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. మృతదేహాలు కూడా రోడ్డు మీద చెల్లా చెదురుగా పడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Prices: ట‌మాట డ‌బుల్‌, సెంచ‌రీ కొట్టిన అల్లం.. హైద‌రాబాద్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.
Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu