నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లైఓవర్లపైనా వాహనాల వేగ పరిమితిని పెంచింది ప్రభుత్వం.
హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లపై వాహనాల వేగ పరిమితిని పెంచారు. 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇకపై పీవీ ఎక్స్‌ప్రెస్ వేతో పాటు అన్ని ఫ్లైఓవర్లపై 80 కిలోమీటర్ల వేగ పరిమతితో ప్రయాణించవచ్చు. అయితే ఆసుపత్రులు, స్కూల్ జోన్‌లలో వేగ పరిమితిని 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. హైదరాబాద్‌లోని అన్ని రోడ్లలోనూ వేగ పరిమితిని 60 కిలోమీటర్లకు పెంచారు.
ఇకపోతే.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) (ghmc) పరిధిలో వాహనాల వేగ పరిమితిని (speed limit) పెంచుతూ బుధవారం నగర పోలీసు కమిషనర్ (hyderabad police commissioner) కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రకాల వాహనాల వేగ పరిమితి గంటకు 40 కిలో మీటర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ స్పీడ్ లిమిట్‌ను పెంచడంతో పాటుగా ఆయా వాహనాల వేగ పరిమితులను వేర్వేరుగా నిర్ణయిస్తూ కమీషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
undefined
Also Read:జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల వేగ పరిమితి పెంపు.. దేనికి ఎంతంటే..?
దీని ప్రకారం కార్లకు 60 కి.మీ, బస్సులు, బైక్‌లకు 50 కి.మీ వేగం పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే డివైడర్స్ లేని చోట కార్లకు 50 కి.మీ స్పీడ్ లిమిట్ పెంచుతున్నట్లు పేర్కొంది. బస్సులు, బైక్‌లకు 40 కి.మీ స్పీడ్ లిమిట్ ఇస్తున్నట్లు పేర్కొంది. కాలనీల్లో వాహనాలకు 30 కి.మీ వేగాన్ని పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది.