పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, వెంటాడి చంపిన ప్రత్యర్థులు

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 07:59 AM IST
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, వెంటాడి చంపిన ప్రత్యర్థులు

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్‌కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్‌కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి తమ్ముణ్ణి బైక్‌పై తీసుకెళ్తుండగా కాపు కాసిన దుండగులు.. కత్తులు, హాకీ స్టిక్కులతో రాకేశ్ కుమార్‌ను వెంటాడారు. అనంతరం మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి బండరాయితో మోదీ హత్య చేశారు.

ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుల పైనా వారు దాడి చేశారు. అర్థరాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu