ఫలక్‌నూమా: గొంతు కోసిన దుండగులు, రోడ్డుపై పరిగెత్తుతూ కుప్పకూలిన వ్యక్తి

Siva Kodati |  
Published : Jun 06, 2021, 03:27 PM IST
ఫలక్‌నూమా: గొంతు కోసిన దుండగులు, రోడ్డుపై పరిగెత్తుతూ కుప్పకూలిన వ్యక్తి

సారాంశం

హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫలక్‌నూమాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 

హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫలక్‌నూమాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని అబ్ధుల్ ఇమ్రాన్ ఫరూఖ్‌గా గుర్తించారు. ఫలక్‌నూమా బస్‌ డిపో సమీపంలోని ఓ వీధిలో నుంచి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.

Also Read:విశాఖ చిన్నారి సింధుశ్రీ కేసు: తల్లి ప్రియుడే హంతకుడు, విచారణలో సంచలన విషయాలు

గొంతు కోసిన తర్వాత దాదాపు 100 మీటర్ల దూరాన్ని అతను పరిగెత్తూ కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలంలో ఓ ఫోన్, ఐడీ ప్రూఫ్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాతకక్షలు లేదా, ఆర్ధిక కారణాల వల్ల హత్య జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీపీ కెమెరా ఫుటేజ్ ద్వారా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌