తెలంగాణ: ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవం వాయిదా

Siva Kodati |  
Published : Jun 06, 2021, 02:46 PM IST
తెలంగాణ: ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవం వాయిదా

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ల ప్రారంభోత్సవం వాయిదా పడింది. మంత్రులందరూ ఒకేసారి జిల్లాల్లో ప్రారంభించేందుకు గాను మందుగా ప్రకటించిన సోమవారం కాకుండా.. ఈ నెల 9న డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు. 

కాగా, రోగాల చికిత్స కంటే రోగ నిర్ధారణే ఖరీదుగా మారిన వేళ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 19 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందన్న ఆయన.. పేదలకు జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ఈ నె 8న తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై చర్చ

పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 19 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డయాగ్నిస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్లుండి నుంచి డయాగ్నిస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి.. ఇది ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు అన్నారు. పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న కేసీఆర్.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రజా ప్రతినిధులదే అన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 57 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో వున్నాయని సీఎం తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి త్వరలోనే కొత్త పేరు పెడతామని ఆయన స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.