అమ్మాయి కోసం స్నేహితుల గొడవ... తాగినమైకంలో హత్యాయత్నం, యాక్సిడెంట్ (వీడియో)

Published : Jun 30, 2023, 04:03 PM IST
అమ్మాయి కోసం స్నేహితుల గొడవ... తాగినమైకంలో హత్యాయత్నం, యాక్సిడెంట్ (వీడియో)

సారాంశం

మందుపార్టీలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యాయత్నానికి, రోడ్డు ప్రమాదానికి దారితీసిన ఘటన పెద్దపల్లి జల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి : మొబైల్ కొనుక్కున్న ఆనందంలో స్నేహితులతో మందు పార్టీ ఇచ్చిన ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. మద్యంమత్తులో స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఒకరిపై హత్యాయత్నంతో పాటు తప్పించుకునే క్రమంలో కారు యాక్సిడెంట్ కు గురయ్యింది. అయితే రెండు ప్రమాదాల నుండి ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

బాధిత యువకుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ, అన్వర్ స్నేహితులు. అయితే అన్వర్ కు తెలిసిన అవినాష్ వద్ద వెంకటరమణ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. 

మందు తాగే సమయంలో ఓ యువతి విషయంలో వెంకటరమణ, అవినాష్ కు గొడవ జరిగింది. తాగిన మైకంలో అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడుతున్న అవినాష్ ను వెంకటరమణ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలో అవినాష్ పదునైన ఆయుధంతో వెంకటరమణ మెడపై దాడిచేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయిన స్నేహితున్ని కాపాడేందుకు అన్వర్ మద్యంమత్తులోనే కారు తీసాడు. 

వీడియో

మద్యం మత్తులో అన్వర్ కారు నడపడంతో ప్రమాదం జరిగింది. మార్కండేయ నగర్ కాలనీలో కారు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. దీంతో వెంకటరమణ మరింత గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంకటరమణను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటరమణ పరిస్థితి మెరుగ్గానే వుంది. స్నేహితుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డ అవినాష్ పరారీలో వున్నాడని... అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్