Choutuppal Murder Case : ప్రతిఘటించిందని అత్యాచారం, భర్తకు చెబుతానందని హత్య.. నిందితుడు అరెస్ట్..

Published : May 12, 2022, 08:10 AM IST
Choutuppal Murder Case : ప్రతిఘటించిందని అత్యాచారం, భర్తకు చెబుతానందని హత్య.. నిందితుడు అరెస్ట్..

సారాంశం

చౌటుప్పల్ లో బుధవారం వెలుగులోకి వచ్చిన గిరిజన మహిళ హత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారానికి ప్రతిఘటించిందని కర్రతో బాది అఘాయిత్యం చేశాడని, భర్తకు చెబుతానందనే చంపేశాడని తెలిపారు.

చౌటుప్పల్ :  tribal married woman (28)పై molestationకి పాల్పడి, ఆమెను murder చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తలపై కర్రతో బాది అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెబుతానని అన్నందుకు ఆమెను హతమార్చాడు. ప్రాణాలు కోల్పోయాక కూడా మరోసారి అత్యాచారం చేశాడు. భువనగిరి జిల్లా తూప్రాన్ పేటలో జరిగిన ఈ హత్యాచారం వివరాలను చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం వెంకటాపురంకి చెందిన ఈడిగి హరీష్ రావు (25)  తూప్రాన్ పేటలో కూలీగా పని చేస్తున్నాడు. 

మూడ వారాల కిందట వల్లభ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక బోరు తవ్వారు. ఆ పనికి వెళ్లి నిందితుడు… సమీపంలోని గోదాములో వివాహిత పగలు ఒంటరిగా ఉంటుందని గమనించాడు. సోమవారం సాయంత్రం ఆమె భర్త లేని సమయంలో హరీష్ గౌడ్ గోదాములోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. రాత్రి ఆమె భర్త ఇంటికి వచ్చాక దారుణం వెలుగుచూసింది. నిందితుడిని మంగళవారం Vallabha డైరీ లేబర్ షెడ్ లో అదుపులోకి తీసుకున్నట్లు ఏసిపి చెప్పారు. అయితే గతంలో అతని మీద కోహిర్ పోలీస్స్టేషన్లో ఓ చోరీ కేసు కూడా నమోదు అయింది అన్నారు.

హత్యాచారానికి సంబంధించి.. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలి నుండి అతడు దొంగిలించిన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిని వేగంగా పట్టుకున్న పోలీసులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించి రివార్డులు పంపించారు అని చెప్పారు. నిందితుడుని  చౌటుప్పల్ కోర్టులో హాజరు పరచి నల్గొండ జైలు కు తరలించినట్లు తెలిపారు. 

కాగా, మంగళవారం నాడు చౌటుప్పల్ లో ఈ ఘటన కలకలం రేపింది. పగటివేళ భర్త పనికి వెళ్లగా చూసిన ఓ దుండగుడు అతడి భార్యపై దారుణంగా molestationకి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత ఆమె అపస్మారక స్థితిలో అచేతనంగా పడి ఉంటే మరోసారి rape చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకునే పారిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా Choutuppalమండలం తూప్రాన్ పేటలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాత్రి సమయానికి పోలీసుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటలలోపే నిందితుడిని  వెతికి పట్టుకున్నారు. అతడి నుంచి వివరాలు రాబడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. విషయాలు చెబుతుంది అనే భయంతోనే నిందితుడు ఆమెను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పొట్టకూటి కోసం వలస వస్తే..
హత్యాచారానికి గురైన గిరిజన మహిళది నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా.  మార్చి 13న ఆమె భర్తతో పాటు తూప్రాన్ పేటకు వలస వచ్చింది. వారిద్దరూ హైదరాబాద్ - విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాం వద్ద కాపలా దారులుగా ఉంటూ అక్కడే ఉంటున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.  సోమవారం ఉదయం అతను డ్యూటీ కి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా, రక్తపుమడుగులో, నగ్నంగా పడి ఉంది. ఆయన వెంటనే బావమరిదికి, అత్తమామలకు, పోలీసులకు సమాచారం అందించాడు. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. ఆమెపై రెండుసార్లు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్