మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఈ సభను ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్:Munugode అసెంబ్లీ నియోజకవర్గంపై Congress పార్టీ దృష్టి కేంద్రీకరించింది. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా Komatireddy Rajagopal Reddy రెండు రోజుల క్రితం ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తున్న నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధ్యక్షులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది నాయకత్వం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు పార్టీ క్యాడర్ వెళ్లకుండా చర్యలు తీసుకోంటుంది.ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నాాను చేస్తుంది నాయకత్వం. ఈ క్రమంలోనే రేపు Chandur లో సభను ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. చండూరులోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఈ సభను ఏర్పాటు చేయనున్నారు.
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను కూడా అందిస్తానని చెప్పారు. ఈ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపితే ఆరు మాసాల్లోపుగా ుప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులుంటాయి. దీం తో ఉప ఎన్నికల్లో తమ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉంది. దీంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విస్తృతంగా పర్యటించనుంది. ఈ ఉప ఎన్నికను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.
undefined
also read:రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం తర్వాతే నేను: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపనుందో ఇంకా తేల్చలేదు. మరో వైపు టీఆర్ఎస్ లో కూడా పలువురు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిని చూపుతున్నారు. 2014లో ఈ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. మునుగోడులో ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ నాయకత్వం స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నియోజకవర్గంలో పర్యటిస్తుంది.