మునుగోడు ఉపఎన్నికను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ తో మళ్లీ పెట్టాలి : కేఏ పాల్

Published : Nov 09, 2022, 09:12 AM ISTUpdated : Nov 09, 2022, 08:36 PM IST
మునుగోడు ఉపఎన్నికను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ తో మళ్లీ పెట్టాలి : కేఏ పాల్

సారాంశం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ కు మునుగోడు ఎన్నికను రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్ ను కోరనున్నారు. అవకతవకలు జరిగాయంటూ ధ్వజమెత్తారు. 

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కే ఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూర్ లో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. అవినీతి, అక్రమాలు జరగనప్పుడు పోలింగ్ ముగిసిన మరుసటిరోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదు అని అడిగారు. 

ఉప ఎన్నికల్లో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కెసిఆర్ కి తొత్తులాగా పని చేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింకు తమకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. స్ట్రాంగ్ రూంకు వేసిన సీలు మారిందని అన్నారు. టిఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నెంబర్ కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతోపాటు అందరికీ తెలిసినా కూడా ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలన్నారు.  మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఛీ కొడుతున్నారని తనని అభిమానిస్తున్నారని కేఏ పాల్ అన్నారు. 

తనను వదిలేసి ప్రియుడితో ఉంటోందని.. భార్యతో సహా ముగ్గురిమీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త...

ఇదిలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ  సూపర్ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బిజెపి రెండో స్థానంలో, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ కూడా  పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్ కు 805ఓట్లు  వచ్చాయి. 

అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే  పరిమితమైన పాల్.. పదమూడో రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్ (ఆఖరి రౌండ్)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు.

అంతా ఫ్రాడ్ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీజై విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తు పోలిన సింబల్స్ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విసయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482మంది ఓటు వేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు