తెలంగాణకు వందే భారత్ వచ్చేస్తోంది.. సికింద్రాబాద్ నుంచే మొదలు..

By SumaBala Bukka  |  First Published Nov 9, 2022, 8:04 AM IST

ఆరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణకు రానుంది. సికింద్రాబాద్ నుంచే ఇది మొదలవుతుంది. దీని నిర్వహణ అంతా సికింద్రాబాద్ లోనే జరుగుతుంది. ఏ రూట్లలో ప్రయాణిస్తుందనేది ఇంకా నిర్ణయించలేదు. 


హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ (ట్రైన్-18) ఎక్స్ ప్రెస్ రాష్ట్రానికి రావడం దాదాపుగా ఖరారైంది. దక్షిణ మధ్య రైల్వే కు తొలి రైలును రైల్వే బోర్డు కేటాయించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. Vande bharat expressను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై రైల్వే బోర్డు కసరత్తులు చేస్తోంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మాదిరిగానే కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. 

కాబట్టి ఎక్కువ దూరం..  రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గరిష్టంగా 10 గంటల్లోపే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఉదయమే బయలుదేరి సాయంత్రానికి,  లేదా రాత్రి 9 10 గంటల లోపు గమ్యస్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు,  ముంబై వంటి మార్గాలను పరిశీలిస్తున్నారు. 

Latest Videos

విశాఖలో కూల్చివేతల కలకలం.. ఆంధ్రాయూనివర్సిటీ ప్రాంతంలో హాహాకారాలు...

ప్రయాణికుల డిమాండ్ ఎటువైపు అంటే..
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రైలు రిజర్వేషన్ కు గిరాకీ ఉంటుంది. విశాఖ వైపు నిత్యం దాదాపు డజను రైళ్లు ఉన్నా రిజర్వేషన్ అంత సులభంగా దొరకదు. తిరుపతి వెళ్లే వారైతే నెలముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. బెంగళూరుకు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందే చేరుకుంటుండటంతో బస్సు ప్రయాణానికే ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆరో వన్దే భారత్ రైలు మనకే..
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యే వన్దే భారత్ ఎక్స్ప్రెస్ లకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్- బెంగళూరు చెన్నై రైలు ఈనెల 10న చట్టాలు ఎక్కనుంది. దక్షిణ భారతానికి  ఇదే తొలి రైలు. ఆరో వందేభారత్ ఎక్స్ప్రెస్ మాత్రం తెలుగు తెలంగాణకే. ప్రారంభ స్థానం సికింద్రాబాద్ నుంచే అని ఓ అధికారి తెలిపారు రైల్వే బోర్డు అధికారులు సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.

రాష్ట్రం నుంచి బయలుదేరేలా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు  కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల  రైల్వేమంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ ను కలిసి కోరారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి.. లేదంటే విశాఖపట్నానికి నడపాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో ప్రస్తుత ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటి సాంకేతిక, ఆర్థిక అంశాలను రైల్వేబోర్డు అధ్యయనం చేస్తుంది.

రైల్వే అధికారులేమంటున్నారంటే.. 
వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు నిర్వహణ సికింద్రాబాద్ లోనే ఉంటుంది. నిర్వహణకు ఐదారు గంటల సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని.. ఏర్పాట్లు చేసుకోవాలని సమాచారం వచ్చింది. ప్రయాణం ఏ రూట్ లో... ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.. అని సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా అన్నారు. 

click me!