తనను వదిలేసి ప్రియుడితో ఉంటోందని.. భార్యతో సహా ముగ్గురిమీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త...

Published : Nov 09, 2022, 08:41 AM IST
తనను వదిలేసి ప్రియుడితో ఉంటోందని.. భార్యతో సహా ముగ్గురిమీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త...

సారాంశం

తనను వదిలేసి వెళ్లిన భార్య మీద పగసాధించాడో భర్త. భార్య, ఆమె ప్రియుడు, వారి చిన్నారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

హైదరాబాద్ : అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం మామూలుగా జరిగేదే. అయితే అది చాలాసార్లు సర్దుకుపోవడంతో సద్దుమణిగిపోతాయి. మరీ ఎక్కువయితే విడిపోయి.. ఎవరి జీవితాలు వారు గడుపుతుంటారు. అలా కాకుండా భార్య తనని వదిలి వేరొకరితో జీవించడం భరించలేకపోయాడు ఓ భర్త.. దీంతో దారుణానికి ఒడిగట్టాడు. మూడు నెలల గర్భిణీ అయిన తనను వదిలివెళ్లిన భార్యతో పాటు, ఆమె ప్రియుడు, వారికి పుట్టిన పది నెలల బాబుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చిక్కడపల్లికి చెందిన నాగుల సాయి (30), ఆరతి (26)లకు  ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో ఆమె మూడేళ్ల క్రితం  భర్త, కొడుకును వదిలి నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద పూలు అమ్ముకునే నాగరాజు (26)తో కలిసి జీవిస్తోంది. వీరికి 10 నెలల కుమారుడు విష్ణు ఉన్నాడు. ఈ క్రమంలో తన కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ నాగరాజుతో తరచూ నాగుల సాయి గొడవ పడేవాడు. 

తెలంగాణకు వందే భారత్ వచ్చేస్తోంది.. సికింద్రాబాద్ నుంచే మొదలు..

సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వారి పూల దుకాణం వద్దకు వెళ్లిన నాగుల సాయి.. ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి ముగ్గురుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరతి, నాగరాజులకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ బాలుడు మంగళవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్