Munugode Bypoll 2022 :పట్టు 'చే'జారిపోకుండా కాంగ్రెస్ యత్నాలు,కీలక నేతలకు మండలాల బాధ్యతలు

Published : Aug 10, 2022, 03:44 PM ISTUpdated : Aug 10, 2022, 03:48 PM IST
Munugode Bypoll 2022 :పట్టు 'చే'జారిపోకుండా కాంగ్రెస్ యత్నాలు,కీలక నేతలకు మండలాల బాధ్యతలు

సారాంశం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ చేజారకుండా ఉండేందుకు గాను  ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ స్థానంలో పోటీకి సిద్దంగా ఆశావాహులకు గాంధీ భవన్ నుండి పిలుపు వచ్చింది. 

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తన పట్టును నిలపుకోవాలని Congress పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ క్యాడర్ చేజారిపోకుండా ప్రయత్నాలను ప్రారంభించింది. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించనుంది. ఈ నెల 16 వేతదీ నుండి నియోజకవర్గంోని పలు మండలాల్లో సభలు నిర్వహించాాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మండలాల వారీగా  బాధ్యతలు అప్పగించిన నేతలు ఆ మండలంలో ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ చేజారకుండా చర్యలు తీసుకోనున్నారు.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై పారటీ సీనియర్ నేత Jana Reddyతో ఎఐసీసీ సెక్రటరీ బోస్ రాజు చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితిపై జానారెడ్డితో  మాజీ మంత్రి  Damoder Reddy చర్చించారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  పోటీకి మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు Palvai Sravanthi  ఆసక్తిగా ఉన్నారు.మరో వైపు ఇదే నియోజకవర్గానికి చెందిన చలమల  Krishna Reddy కూడా టికెట్ కోసం ఆశిస్తున్నారు.  ఓ పార్టీ కార్యకర్తతో పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి ఆసక్తిగా ఉన్న వారిని గాంధీ భవన్ కు రావాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరినట్టుగా సమాచారం.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు దఫాలు విజయం సాధించారు. గోవర్ధన్ రెడ్డి కూతురే స్రవంతి. గోవర్ధన్ రెడ్డి మరణం తర్వాత స్రవంతి ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతికి బదులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో  ఈ స్థానంలో టికెట్ కోసం స్రవంతి ప్రయత్నాలు ప్రారంభించారు.

also read:Munugode Bypoll 2022 పై కాంగ్రెస్ ఫోకస్ : నేడు హైద్రాబాద్ కు మాణికం ఠాగూర్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు.  మునుగోడు ఉపఎన్నికలపై ఠాగూర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.2014లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 21న చౌటుప్పల్ లో నిర్వహించే సభలో రాజగోపాాల్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. మునుగోడులో తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలుు చేస్తుంది. మరో వైపు ఈ స్థానంలో విజయం సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలియగానే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఊహించిన టీఆర్ఎస్ ముందస్తు ఏర్పాట్లు  ప్రారంభించింది

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?