అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ

By narsimha lode  |  First Published Aug 5, 2022, 3:23 PM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.


హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah తో మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy భేటీ అయ్యారు. BJP లో చేరే విషయమై తేదీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా  ఉన్నారు.

ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి , మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు  సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను  కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపారు. ఈ నెల 8వ తేదీన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి  ఎమ్మెల్యే పదవికి  కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పిస్తారు. ఈ నెల 10వ తేదీ లోపుగా మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని  రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఈ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. 

Latest Videos

బీజేపీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి  కొన్ని ముహుర్తాలను కూడా చూసుకొన్నారు.ఈ ముహుర్తాల ఆధారంగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. న్యూఢిల్లీలో కంటే తన నియోజకవర్గంలో పార్టీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.ఈ విషయమై అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి ఒప్పించారని సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించే సభకు అమిత్ షా కూడా  వస్తానని హమీ ఇచ్చారని తెలుస్తుంది.

click me!