చౌటుప్పల్‌లో అనుకున్న లీడ్ రాలేదు.. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. కీలక కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Nov 6, 2022, 11:00 AM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,‌బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది.

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,‌బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్స్ ఫలితాలు వెలువడగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 700 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. చౌటుప్పల్‌లో తాము అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదని చెప్పారు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయని తెలిపారు. నాలుగు రౌండ్స్ ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్నారు. 

ప్రజలు ఇచ్చే తీర్పు కోసం వేచిచూస్తామని చెప్పారు.  చివరి వరకు హోరా హోరీ పోరు తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. అనంతరం ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి ఇప్పుడే టిఫిన్ చేసి వస్తానని అంటూ బయటకు వెళ్లిపోయారు. ఇక, బీజేపీ నాయకులు మాత్రం.. ఇప్పటివరకు నాలుగు రౌండ్ల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయని.. ఇంకా 11 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉందని.. తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక, మునుగోడు ఉప ఎన్నిక తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా వచ్చే అవకాశముంది. తొలుత చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించారు. ఇంకా నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉంది. 

మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.

click me!