మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగంవారి గూడెంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈ గ్రామం టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రామం.
మునుగోడు:మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తన స్వంత గ్రామంలో కూడ షాక్ ఇచ్చారు. తన స్వగ్రామం లింగంవారి గూడెంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు.
సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని సర్వేల్ గ్రామానికి సమీపంలో లింగంవారి గూడెం గ్రామం ఉంటుంది. పోలింగ్ రోజున కూసుకుంట్ల ప్రభాకర్ రె్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ లింగంవారిగూడెంలో బీజేపీ ఆధిక్యంలో నిలిచారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చసింది.
alsoread:మునుగోడు బైపోల్ 2022:నాలుగో రౌండ్‌లో కూసుకుంట్లపై కోమటిరెడ్డి ఆధిక్యం
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.