Munugode Bypoll 2022 బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీకే మద్దతు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

By narsimha lodeFirst Published Aug 14, 2022, 2:48 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై వారం రోజుల్లో నిర్ణయం తీసుకొంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయమై వారం రోజుల్లో నిర్ణయిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.ఆదివారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం మీడియాతో మాట్లాడారు. మునుగోడు  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీని ఏ పార్టీ ఓడిస్తే ఆ పార్టీకి మద్దతిస్తామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో ఏ పార్టీ బీజేపీని ఓడిస్తుందో ఆ పార్టీకి మద్దతిస్తామని ఆయన చెప్పారు.ఈ నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఆరు మాసాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య  పరిస్థితి నెలకొంది.  ఈ  నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. చౌటుప్పల్ లో నిర్వహించే సభలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ స్థానం నుండి పోటీ చేసే విజయమై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై సీపీఎంతో కూడా చర్చిస్తామని సీపీఐ నేతలు చెప్పారు. పోటీపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్ధి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ నెల 20వ తేదీన  నిర్వహించే సభ తర్వాత మునుగోడులో పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి నేతలు  తమ గళాన్ని పెంచారు. ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని కోరారు. అసమ్మతి నేతలను సీఎం కేసీఆర్ వద్దకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఇటీవల తీసుకెళ్లారు.  ఈ సమావేశం ముగిసిన తర్వాత టికెట్ ఎవ్వరికీ ఇచ్చినా కూడా కలిసి పనిచేస్తామని నేతలు ప్రకటించారు.

రెండు రోజుల క్రితం చౌటుప్పల్ మండలం మల్కాపురం వద్ద ఆంధోల్ మైసమ్మ ఆలయం వద్ద కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ స్థానంలో బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే  విషయమై కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. బీసీ సామాజిక వర్గం నుండి పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్  పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె రవికుమార్, కర్నాటి విద్యాసాగర్, బూర నర్సయ్య గౌడ్ వంటి నేతల పేర్లను టీఆర్ఎస్ పరిశీలిస్తుందని ప్రచారం సాగుతుంది. 

also read:Munugode Bypoll 2022: మునుగోడులో వాటిపైన చర్చ జరగాలి: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి వీడియో సందేశం

కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకోవాలని భావిస్తుంది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థానంలో ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా వెళ్లకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.


 

click me!