మునుగోడు బైపోల్ 2022: ఏడో రౌండ్‌లో కోమటిరెడ్డిపై కూసుకుంట్ల పైచేయి

By narsimha lode  |  First Published Nov 6, 2022, 1:40 PM IST

ఏడో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్  అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆధిక్యంలో  నిలిచారు. నాలుగు రౌండ్ల  నుండి టీఆర్ఎస్  అభ్యర్ధి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


మునుగోడు:మునుగోడు  అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో ఏడో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు. ఏడో  రౌండ్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 386 ఓట్ల ఆధిక్యం  దక్కింది. ఏడో  రౌండ్ లో టీఆర్ఎస్  అభ్యర్ధికి 7,189 ఓట్లు,  బీజేపీ  అభ్యర్ధి  కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి 6,803 ఓట్లు వచ్చాయి. 

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సాధించింది..ఐదో రౌండ్ లో కూడ టీఆర్ఎస్  ఆధిక్యాన్ని  సాధించింది. ఆరో రౌండ్ లో  టీఆర్ఎస్ లీడ్ లో నిలిచింది. ఏడో రౌండ్ లో కూడ  టీఆర్ఎస్  లీడ్ లో నిలిచింది.ఏడు  రౌండ్లను  కలుపుకుంటే  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 45,710 ఓట్లు , బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 43,155 ఓట్లు,కాంగ్రెస్  కు 13,675 ఓట్లు వచ్చాయి.

Latest Videos

also read:మునుగోడు బైపోల్ 2022:ఆరో రౌండ్‌లో కోమటిరెడ్డిపై కూసుకుంట్ల ఆధిక్యం

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

click me!