ఐదో రౌండ్ ఫలితం ఎందుకు ఆలస్యమైంది:మునుగోడు బైపోల్ పై రఘునందన్ రావు

By narsimha lode  |  First Published Nov 6, 2022, 1:28 PM IST

మునుగోడు ఉప  ఎన్నిక  ఫలితం ఆలస్యం కావడంపై  బీజేపీ  అనుమానం  వ్యక్తం  చేసింది. ఈ  ఎన్నిక  ఫలితం త్వరగా వెల్లడించాలని  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు కోరారు.
 


హైదరాబాద్: ఎన్నికల  అధికారులు  నిష్పక్షపాతంగా  తమ  విధులను నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.ఆదివారంనాడు  బీజేపీ  ఎమ్మెల్యే  రఘునందన్ రావు  హైద్రాబాద్  లో  మీడియాతో  మాట్లాడారు. దేశం  మొత్తం  మునుగోడు  ఉప ఎన్నిక ఫలితం  కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గంటన్నరలోపుగా మొదటి నాలుగు రౌండ్ల పలితాలను వెల్లడించిన  ఎన్నికల  సంఘం  అధికారులు  ఆ తర్వాత  ఫలితాల  వెల్లడిలో  ఎందుకు జాప్యం  చేస్తున్నారో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. ఐదో  రౌండ్  ఫలితం ప్రకటించడానికి  గంటన్నర సమయం తీసుకోవడంపై  అనుమానాలు  వ్యక్తమ య్యాయన్నారు.

also read:మునుగోడు బైపోల్ 2022: కౌంటింగ్ హల్ లో గోల్ మాల్ చేయలేరన్న కోమటిరెడ్డి

Latest Videos

ఫలితాలను  ఎంత  త్వరగా వీలైతే అంత త్వరగా వెల్లడించాలనిఆయన ఎన్నికల  అధికారులను  కోరారు. అవగాహన లేని  అధికారులు   కౌంటింగ్  కేంద్రంలో విధులు నిర్వహించడం వల్ల  ఈ రకమైన పరిస్థితి  నెలకొందని  ఆయన ఆరోపించారు.కౌంటింగ్  విధులు  నిర్వహిస్తున్న  అధికారులకు  సరైన శిక్షణ  ఇవ్వని  కారణంగానే  ఈ రకమైన పరిస్థితి నెలకొందని ఆయన  ఆరోపించారు. ఆలస్యం  జరిగినప్పుడూ  అనుమానాలు వస్తాయన్నారు.2018  ఎన్నికల  సమయంలో తొలుత  ఒకరు  విజయం  సాధించారని చెప్పి  ఆ తర్వాత మరొకరు  గెలుపొందారని ప్రకటించారని  రఘునందన్ రావు  గుర్తు  చేశారు. ఎన్నికల  అధికారులు  నిష్పక్షపాతంగా తమ విధులను  నిర్వహించాలని ఆయన  కోరారు. మొదటి  నాలుగు రౌండ్లలో కూడ  47 అభ్యర్ధుల ఓట్లను  లెక్కించారన్నారు. ఐదో  రౌండ్లోనే  47 మంది  అభ్యర్ధులు  వచ్చారా అని ఆయన  ప్రశ్నించారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

click me!