మునుగోడు బైపోల్ 2022: ఎనిమిదో రౌండ్‌లోనూ కోమటిరెడ్డి వెనుకంజ

Published : Nov 06, 2022, 02:01 PM ISTUpdated : Nov 06, 2022, 02:10 PM IST
మునుగోడు బైపోల్  2022: ఎనిమిదో  రౌండ్‌లోనూ కోమటిరెడ్డి వెనుకంజ

సారాంశం

మునుగోడు  ఉప  ఎన్నిక  కౌంటింగ్ లో  ఎనిమిదో రౌండ్  లో బీజేపీపై టీఆర్ఎస్ లీడ్ లో  ఉంది. నాలుగో రౌండ్  నుండి ఎనిమిదో రౌండ్ వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. 

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో ఎనిమిదో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు.ఎనిమిదో  రౌండ్  లో  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6624 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 6088  ఓట్లు వచ్చాయి.ఈ రౌండ్  లో బీజేపీ కంటే టీఆర్ఎస్  536  ఓట్ల  ఆధిక్యంలో  నిలిచింది.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ నుండి ఎనిమిదో రౌండ్  వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ  కేవలం  2,3 రౌండ్లలో మాత్రమే లీడ్ లో నిలిచింది.ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 52,334 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి 49,243 ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 13,689 ఓట్లు దక్కాయి.

also read:మునుగోడు బైపోల్ 2022: ఏడో రౌండ్‌లో కోమటిరెడ్డిపై కూసుకుంట్ల పైచేయి

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu