ఈ నెల 14న పాల్వాయి స్రవంతి నామినేషన్: మునుగోడులో దసరా తర్వాత రేవంత్ సభలు

By narsimha lode  |  First Published Oct 4, 2022, 4:14 PM IST

ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఇవాళ జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.



హైదరాబాద్:ఈ నెల 14వ  తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు  మంగళవారం నాడు గాంధీ భవన్ లో సమావేశమయ్యారు.

 ఈ సమావేశానికి మునుగోడునియోజకవర్గానికి చెందిన మండల ఇంచార్జీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల  ఇంచార్జీ మాణికం ఠాగూర్ కూడ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ నెల 14వ తేదీన  పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీనిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నారు.  ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తాను కూడా వస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని పాల్వాయి స్రవంతి చెప్పారు. గతంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించిన సమయంలో ఈ మేరకు కాంగ్రెస్ నేత హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఆ  పార్టీకి గుడ్ బై చెప్పారు. 

ఈ ఏడాది ఆగస్టు 4న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.  ఈ దఫా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు.  దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది.

also read:ఈ నెల 8న మునుగోడుపై బీజేపీ కీలక నేతల భేటీ: వ్యూహంపై చర్చ

 ఈ స్థానంలో విజయం సాధించడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ  భవితవ్యానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మరునాడే చండూర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇద్దరు చొప్పున ఇంచార్జీలను నియమించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీకి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని నియమించారు.  
 

click me!