ఈ నెల 8న మునుగోడుపై బీజేపీ కీలక నేతల భేటీ: వ్యూహంపై చర్చ

By narsimha lode  |  First Published Oct 4, 2022, 3:16 PM IST

ముమునుగోడు  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు.ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 
 


హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ముఖ్య నేతలు ఈ నెల 8వ తేదీన సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్  లు కూడా హాజరు కానున్నారు.  బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఉపఎన్నికను పురస్కరించుకొని అనుసరించాల్సిన వ్యూహంపై  బీజేపీ నేతలు చర్చించనున్నారు. స్టీరింగ్ కమిటీ, మండల ఇంచార్జీు లు ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీలతో చర్చించనున్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ విజయం సాధించింది.  దుబ్బాక నుండి రఘునందన్ రావు,హుజురాబాద్ నుండి ఈటల రాజేందర్ గెలుపొందారు. ఇదే స్థానం నుండి ఈటల రాజేందర్ గతంలో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలుపొందారు. బీజేపీలో చేరిన తర్వాత కూడా ఇదే స్థానం నుండి ఈటల రాజేందర్ విజయం సాధించారు.

Latest Videos

మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని  కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. రానున్న ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ తరుణంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణపై ఫోకస్ చేశారు. గతంలో యూపీలో పనిచేసిన సునీల్ బన్సాల్ ను  బీజేపీ తెలంగాణ  సంస్థాగత ఇంచార్జీగా ఆ పార్టీ నియమించింది. మునుగోడుపై  సునీల్ బన్సాల్ ఇటీవల సమీక్ష నిర్వహించారు.  మునుగోడులో  స్టీరింగ్ కమిటీని  బీజేపీ ప్రకటించింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థానం నుండి  విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డి పోటీలో నిలిచారు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆగస్టు 21న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

also read:మునుగోడు బైపోల్ 2022: పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ, వ్యూహంపై చర్చ

మునుగోడు అసెంబ్లీ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు  శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పట్టుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన సమయంలో కొందరు నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లారు.  ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా  టీపీసీసీ నాయకత్వం చర్యలు తీసుకొంది. మండలాల వారీగా ఇంచార్జీలను  నియమించింది.

click me!