మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో రెండు,మూడు నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు.నాలుగోరౌండ్ల లో టీఆర్ఎస్ లీడ్ లో నిలిచింది
మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో నాలుగో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఆదిక్యంలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్ధికి 4,854 ఓట్లు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డికి 4,555 ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 1817 ఓట్లు దక్కాయి..,
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో చౌటుప్పల్ మండలం ఓట్ల ను లెక్కిస్తున్నారు. చౌటుప్పల్ మండలానికి అన్ని పోలింగ్ స్టేషన్లలోని ఓట్లను 1 నుండి 4 రౌండ్లలో లెక్కించనున్నారు. చౌటుప్పల్ పట్టణంతో పాటు రూరల్ మండలంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ఫస్ట్ రౌండ్ లో బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడోరౌండ్ లో కూడా బీజేపీ ఆధిక్యంలో నిలిచారు.నాలుగో రౌండ్ లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ కి 26,443 ఓట్లు, బీజేపీకి 25,729 ఓట్లు,కాంగ్రెస్ కి 7,380 ఓట్లు దక్కాయి.నాలుగో రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ పై టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
undefined
also read:మునుగోడు బైపోల్ 2022:మూడో రౌండ్ లో టీఆర్ఎస్ పై బీజేపీ ఆధిక్యం
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.