ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: చండూరులో టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలు

By narsimha lode  |  First Published Oct 27, 2022, 11:46 AM IST

తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు  బీజేపీ ప్రయత్నించిందని ఆరోపిస్తూ  చండూరులో  టీఆర్ఎస్  ఆందోళనకు  దిగింది.బీజేపీ దిష్టిబొమ్మను దగ్దం  చేసింది. టీఆర్ఎస్ కు కౌంటర్  గా  బీజేపీ  ఆందోళన నిర్వహించింది.


చండూరు:తమ పార్టీ  ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ  ప్రయత్నించిందని ఆరోపిస్తూ  టీఆర్ఎస్  ఆధ్వర్యంలో  గురువారంనాడు చండూరులో  నిరసనకు దిగారు.  బీజేపీ  దిష్టిబొమ్మను  దగ్దం  చేశారు.  టీఆర్ఎస్  నేతలు.మునుగోడులో ఓటమి పాలౌతున్నామనే  భయంతోనే  బీజేపీ  తమ  పార్టీ ఎమ్మెల్యేలను  కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని  టీఆర్ఎస్  నేతలు  ఆరోపించారు.  బీజేపీకి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. మునుగోడులో  గెలిచేందుకు  బీజేపీ  అడ్డదారులు తొక్కుతుందని  టీఆర్ఎస్ నేతలు  విమర్శలు  గుప్పించారు.

తెలంగాణలోని కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వాన్ని  కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని టీఆర్ఎస్  ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు.కేంద్రంలో  ఎనిమిదేఁళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో  దేశ ప్రజలకు  ఉపయోగపడే  ఏ ఒక్క పనైనా  చేసిందా అని ఆయన  ప్రశ్నించారు. సీబీఐ,ఈడీ,  ఐటీ  సంస్థలను తమపై  ఉసిగొల్పుతున్నారని  వినయ్ భాస్కర్  ఆరోపించారు.ధనబలంతో  తమ ఎమ్మెల్యేలను  కొనుగోలు చేశారన్నారు. ఉధ్యమ  నేపథ్యం  ఉన్న  తమ  పార్టీ  ఎమ్మెల్యేలు  బీజేపీ  కుట్రలను  తిప్పి కొట్టారన్నారు.

Latest Videos

టీఆర్ఎస్ ఆందోళనలో  వామపక్షాలు కూడా పాల్గొన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఆ  పార్టీ  ప్రయత్నాలు  చేస్తుందని  సీపీఎం నేత ,మాజీ  ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ రాజకీయాలను ఖండించాలన్నారు.

టీఆర్ఎస్ నిరసనలకు బీజేపీ  కౌంటర్ గా ఆందోళనలు నిర్వహించింది. చండూరులోనే టీఆర్ఎస్  దిష్టిబొమ్మను బీజేపీ దగ్దం  చేసింది. రెండు  పార్టీలు  పరస్పరం  ఆరోపణలు  చేసుకుంటూ  నిరసనలకు దిగడంతో కొద్దిసేపు  ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కు ప్రలోభాలు: ముగ్గురిపై కేసు,ఫోన్లు స్వాధీనం

ఇదిలా  ఉంటే టీఆర్ఎస్ ఆరోపణలను  బీజేపీ తీవ్రంగా  ఖండించింది. మునుగోడు  ఉప  ఎన్నికల  నేపథ్యంలో  టీఆర్ఎస్  డ్రామాకు  తెరలేపిందని  బీజేపీ  నేత  మురళీధర్ రావు  ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు ఏం  చెప్పారో  అదే విషయాలను  పోలీసులు చెబుతున్నారన్నారు.2023  ఎన్నికల్లో టీఆర్ఎస్  ను గద్దెదించడమే తమ ముందున్న లక్ష్యమని  ఆయన  చెప్పారు. కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి  రాజీనామా  చేసి బీజేపీలో  చేరిన విషయాన్ని  ఆయన  గుర్తు చేశారు.

click me!