మునుగోడులో ఏరులై పారుతున్న మద్యం.. ఎన్ని కోట్ల లిక్కర్ విక్రయం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Published : Oct 27, 2022, 11:41 AM IST
మునుగోడులో ఏరులై పారుతున్న మద్యం.. ఎన్ని కోట్ల లిక్కర్ విక్రయం జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.   

మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే మునుగోడులో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. మునుగోడులో మద్యం ఏరులైపారుతుందని, ఓటర్లకు పెద్ద ఎత్తున నగదు పంచుతున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే మునుగోడులో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ విషయం నిజమనే అనిపిస్తుంది. 

మునుగోడులో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. నవంబర్ 3న పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గంలో మద్యం విక్రయాలు రూ. 300 కోట్లు దాటే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. ఇక్కడ సగటున నెలవారీ మద్యం విక్రయాలు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య ఉండగా.. ఉప ఎన్నిక నేపథ్యంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 1 నుంచి 22 వరకు ఒక్క మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే రూ.160 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మునుగోడు నియోజకవర్గం ఉన్న నల్గొండ జిల్లా మొత్తం ఒక నెలలో అమ్ముడయ్యే విక్రయాలను ఇది మించిపోయింది. నల్గొండలో సగటున ఈనెలలో 22 రోజుల్లో రూ. 134 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

మునుగోడు నియోజకవర్గం విషయాని వస్తే.. ఇక్కడ దాదాపు 25 వైన్ షాపులు, అనేక బెల్ట్ షాపులు ఉన్నాయి. ఉప ఎన్నిక తేదీ ప్రకటించకముందే మునుగోడులో రూ. 36 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. అయితే గతేడాది అదే నెలలో అక్కడ మద్యం విక్రయాలు రూ. 25 కోట్లకు పైగా ఉన్నాయి. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత.. రాజకీయ వేడి పెరుగుతున్న విధంగానే, మద్యం అమ్మకాలలో పెరుగుదల కనిపిస్తుంది. 

ఇప్పటికే మునుగోడులో మందు పార్టీలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజా గణంకాలను పరిగణలోకి తీసుకుంటే.. ఈ నెలాఖరు నాటికి మునుగోడులో మద్యం విక్రయాలు రూ.250 కోట్లకు చేరుకోవచ్చని, పోలింగ్‌కు ముందు రెండు రోజుల్లో రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు పెరగవచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నాయి. నియోజకవర్గంలోని మునుగోడు మండలంలో అధికంగా మద్యం విక్రయాలు జరగగా.. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ విక్రయాలు తక్కువగా ఉన్నాయి. ఇందుకోసం కొన్ని పార్టీలు.. ఆయా మండలాల్లో పలు షాప్‌ల యజమాన్యంతో డీల్ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. రోజువారీగా నిర్ణీత సంఖ్యలో మద్యం పంపిణీ జరుపుతున్నట్టుగా అక్కడివారు చెబుతున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం