మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రూ.19 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.గట్టుప్పల్ సమీపంలో పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.నిన్ననే చల్మెడ వద్ద పోలీసులు కోటి రూపాయాలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
మునుగోడు:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నాడు రూ.19లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిన్ననే చల్మెడ వద్ద కోటి రూపాయాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చెక్ పోస్టుల వద్ద కాకుండా రోడ్లపై వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీలు చేసిన సమయంలో నగదును పోలీసులు గుర్తించారు. ఇవాళ గట్టుప్పల్ సమీపంలోని కారులో రూ.19 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కారులో ఓ పార్టీకి చెందిన జెండాలను గుర్తించారు .అయితే ఈ నగదు ఎక్కడిదనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ట్రెజరీ కార్యాలయానికి తరలిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే రూ.13 లక్షలను సీజ్ చేశారు పోలీసులు. ఆ తర్వాత మునుగోడు మండలం రత్తుపల్లి వద్ద రూ.6.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు .ఈ నెల 7న గూడపూర్ వద్ద రూ.79 లక్షలను సీజ్ చేశారు .నిన్న చల్మెడ వద్ద కోటి నగదును పోలీసులు సీజ్ చేశారు.
వచ్చే నెల 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఆగస్టు 8 వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు నాలగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
మునుగోడులో నామినేషన్ల ఉపసంహరణ నిన్న పూర్తైంది.మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇందులో సుమారు 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు బరిలో ఉన్నారు.మునుగోడులో విజయం కోసం మూడు పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.మునుగోడులో విజయం సాధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.