ఎంబీఎస్ జ్యుయల్లర్స్ లో ముగిసిన ఈడీ సోదాలు:రూ.100 కోట్ల విలువైన బంగారం,వజ్రాలు సీజ్

By narsimha lode  |  First Published Oct 18, 2022, 11:50 AM IST

ఎంబీఎస్,ముసద్దీలాల్  జ్యుయలర్స్  సంస్థల్లో ఇవాళ  మధ్యాహ్నం  ఈడీ  సోదాలు ముగిశాయి.  హైద్రాబాద్, విజయవాడ,గుంటూరులలో సంస్థకు చెందిన షోరూమ్ లను మూసివేశారు.
 
హైదరాబాద్: ఎంబీఎస్, ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ సంస్థల్లో  మంగళవారం నాడు మధ్యాహ్ననికి  ఈడీ సోదాలు ముగిశాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను  ఈడీ  అధికారులు  సీజ్  చేశారు. నిన్నటి నుండి   ఈ సంస్థల్లో  ఈడీ అధికారులు సోదాలు  చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి కూడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

హైద్రాబాద్ ,విజయవాడ,గుంటూరులలోని ఈ సంస్థల  షోరూమ్ లను మూసివేశారు.సుఖేష్ గుప్తా, అనురాగ్  గుప్తాలపై ఈడీ అధికారులు కేసులు నమోదు  చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది.అక్రమ మార్గంలో బంగారాన్ని  సుఖేష్ గుప్తా కొనుగోలు  చేసినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు.ఈ విషయమై సుఖేష్ గుప్తాపై గతంలోనే ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా కూడ  సుఖేష్ గుప్తా తీరు మార్చుకోలేదని ఆ కథనం తెలిపింది.

Latest Videos

ఎంబీఎస్ గ్రూప్  సంస్థలు ఐదు  శాతం పన్నులు అదనంగా చెల్లించకుండా  పారెక్స్  స్థానాలను నిర్వహించేందుకు ఎంఎంటీసీ నుండి క్రెడిట్ పై బంగారాన్ని పొందాయని అధికారులు గుర్తించారు. దీంతో 2014లో సీబీఐ అధికారులు  కేసు  నమోదు చేశారు.

అదే విధంగా పెద్ద నగదు  నోట్ల రద్దు  సమయంలో భారీగా నిధులను మళ్లించారని  హైద్రాబాద్ లోని  ముసద్దీలాల్  జ్యుయలర్స్ పై అధికారులు సోదాలు చేశారు. నకిలీ పత్రాలను చూపించారని ఈ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.

click me!