టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కు ప్రలోభాలు: ముగ్గురిపై కేసు,ఫోన్లు స్వాధీనం

By narsimha lodeFirst Published Oct 27, 2022, 11:02 AM IST
Highlights

మొయినాబాద్  ఫాంహౌస్ ను పోలీసులు తమ ఆధీనంలోకి  తీసుకున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి  ఫోన్లను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. ఫాం హౌస్  సీసీటీవీ  పుటేజీని పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్:  మొయినాబాద్  ఫాం హౌస్  ను  పోలీసులు  తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను  ప్రలోభ పెట్టేందుకు  ప్రయత్నించారని  ఆరోపణలు ఎదుర్కొంటున్న  ముగ్గురిపై  మొయినాబాద్  పోలీస్ స్టేషన్ లో  కేసు  నమోదైంది.

పార్టీ మారితే తమకు  డబ్బులు,కాంట్రాక్టులు ఇస్తామని  కొందరు  ప్రలోభాలు  పెడుతున్నారని  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  తమకు  సమాచారం అందించారని సైబరాబాద్  సీపీ స్ఠీఫెన్  రవీంద్ర చెప్పారు. ఎమ్మెల్యేల పిర్యాదు  ఆధారంగా  తాము ఫాం హౌస్  పై దాడి చేసినట్టుగా ఆయన నిన్న రాత్రి  మీడియాకు  సీపీ చెప్పారు.నిన్న రాత్రే ముగ్గురిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాండూరు  ఎమ్మెల్యే పైలెట్  రోహిత్ రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు   రామచంద్ర భారతి  అలియాస్ సతీష్ శర్మ,  సింహయాజీ , నందులపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో   కేసు నమోదైంది.120 బీ, 171 బీ,  రెడ్ విత్ 171 ఈ, 506 ,రెడ్ విత్, ఐపీసీ 34 ,,యాక్ట్  సెక్షన్ 8 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మొయినాబాద్  పోలీసులు  పాంహౌస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొయినాబాద్ ఫాంహౌస్  ను తనిఖీ చేస్తున్నారు. పాం హౌస్ చుట్టూ ఉన్న సీసీటీవీ  పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.  టీఆర్ఎస్  ఎమ్మెల్యేల ను ప్రలోభపెట్టేందుకు  ప్రయత్నించారని  ఆరోపణలు ఎదుర్కొంటున్న  రామచంద్రభారతి, సింహయాజీ, నందుల సెల్  ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎమ్మెల్యేలతో   ఈ  ముగ్గురు ఎప్పటి  నుండి టచ్ లో ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా  తీస్తున్నారు. ఈ  ముగ్గురిని  పోలీసులు  రహస్య ప్రాంతంలో  ఉంచి  విచారిస్తున్నారు.ఈ  ఫాం  హౌస్ లో  ఎప్పటి  నుండి  ఈ  ముగ్గురున్నారనే  విషయమై  కూడ  పోలీసులు  ఆరా తీస్తున్నారని  ప్రముఖ  తెలుగు  న్యూస్  చానెల్  టీవీ 9  కథనం  ప్రసారం  చేసింది. ఈ ముగ్గురు ఎలా తమను  ప్రలోభ పెట్టారనే విషయాన్ని  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారని ఆ  కథనం తెలిపింది. 

బుధవారం  నాడు రాత్రి  గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి,రేగా కాంతారావులు కారులో   ఫాంహౌస్ నుండి  ప్రగతి భవన్  కు చేరుకున్నారు. పోలీసులకు స్టేట్ మెంట్  ఇచ్చిన తర్వాత   పైలెట్ రోహిత్ రెడ్డి   పోలీసుల  రక్షణ మధ్య ప్రగతి భవన్  కు చేరుకున్నారు. నిన్న రాత్రి  నుండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు  ప్రగతి భవన్ లోనే ఉన్నారు.

alsoread:ఎమ్మెల్యేల కొనుగోలును టీఆర్ఎస్‌‌ ప్రారంభించింది: సీఎల్పీ భట్టి

నలుగురు  అధికార పార్టీ ఎమ్మెల్యేలను తాము ప్రలోభ  పెట్టినట్టుగా   టీఆర్ఎస్  చేసిన  ఆరోపణలను బీజేపీ తీవ్రంగా  ఖండించింది. ఎమ్మెల్యేలతో ఉన్న వారికి బీజేపీ  ఏం  సంబంధం ఉందని  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.మునుగోడులో ఓటమి  పాలౌతామనే  భయంతో  టీఆర్ఎస్  ఈ డ్రామాకు తెర తీసిందని  బీజేపీ ఆరోపించింది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ  పెట్టేందుకు  ఈ  ముగ్గురు ప్రయత్నించారా లేదా అనే విషయమై  పోలీసులు ఆధారాలను  సేకరిస్తున్నారు. 

click me!