మూడేళ్ల క్రితం హత్య.. హైదరాబాద్‌లో నిందితులు, సినిమా రేంజ్‌లో ఛేజ్ చేసిన ముంబై పోలీసులు

Siva Kodati |  
Published : Sep 17, 2022, 09:53 PM IST
మూడేళ్ల క్రితం హత్య.. హైదరాబాద్‌లో నిందితులు, సినిమా రేంజ్‌లో ఛేజ్ చేసిన ముంబై పోలీసులు

సారాంశం

హైదరాబాద్ ఎస్సార్‌ నగర్‌లో సినీ ఫక్కీలో నిందితుల్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు ముంబై పోలీసులు. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. పోలీసుల ఛేజింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

హైదరాబాద్ ఎస్సార్‌ నగర్‌లో సినీ ఫక్కీలో పోలీస్ ఛేజింగ్ జరిగింది. హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు రోడ్లపై పరుగులు తీశారు పోలీసులు. చూసే వారికి ఇది నిజమో సినిమా షూటింగో అర్ధం కాలేదు. మూడేళ్ల క్రితం ముంబైలో హత్య చేసిన పోలీసులు హైదరాబాద్‌లో తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 25 రోజుల నుంచి హైదరాబాద్‌ని జల్లెడ పడుతున్నారు. ఇవాళ ఎస్సార్ నగర్‌లో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో పోలీసులను గమనించిన పోలీసులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుల వెంట పరుగులు తీశారు. ఛేజింగ్ తర్వాత ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు ముంబై పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?