స్థానిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా.. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం

By Siva KodatiFirst Published Jun 4, 2019, 10:08 AM IST
Highlights

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. 

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు రెండేసి టేబుళ్ల చొప్పున ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు..

అనంతరం బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను బయటకు తీసి.. వాటి మడతలు విప్పకుండానే ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా వేరుచేసి పాతిక ఓట్ల చొప్పున కట్టలు కడతారు. అనంతరం ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తి చేసి.. జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును చెపడతారు.

మొత్తం 8 రౌండ్లలో లెక్కింపును ప్రక్రియను పూర్తి చేస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గత నెలలో 5,659 ఎంపీటీసీలు, 534 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది.

వీటిలో 158 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఫలితాల అనంతరం ఈ నెల 7వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు,8వ తేదీన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైఎస్ ఛైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు జరపనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. 

click me!