రాంపూర్ పంపుహౌస్ పనుల్ని పరిశీలించిన కేసీఆర్

Siva Kodati |  
Published : Jun 04, 2019, 09:37 AM IST
రాంపూర్ పంపుహౌస్ పనుల్ని పరిశీలించిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని పంపుహౌస్ పనులకు సీఎం పరిశీలిస్తున్నారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని పంపుహౌస్ పనులకు సీఎం పరిశీలిస్తున్నారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

పంపుహౌస్ వద్ద 24 గంటలు మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయని.. ఇప్పటికే ఒక మోటార్‌కు డ్రై రన్ సక్సెస్ అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండో మోటారు పనులు చివరిదశలో ఉన్నాయని.. ఈ నెలాఖరుకు నాలుగింటిని సిద్ధం చేసే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు.

అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి గంటలకు మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడే అధికారులతో సమీక్షిస్తారని సమాచారం. అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు. రాంపూర్ ప్రాజెక్ట్‌ పనుల్ని పరిశీలించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!