కాంగ్రెలో చేరికలపై వివాదం.. నల్గొండ పరిణామాలపై ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి అభ్యంతరం..!!

Published : Jun 21, 2023, 11:12 AM IST
కాంగ్రెలో చేరికలపై వివాదం.. నల్గొండ పరిణామాలపై ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి అభ్యంతరం..!!

సారాంశం

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది. అయితే చేరికల అంశం కొన్నిచోట్ల పార్టీలో విభేదాలన తెరమీదకు తీసుకొస్తుంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది. అయితే చేరికల అంశం కొన్నిచోట్ల పార్టీలో విభేదాలన తెరమీదకు తీసుకొస్తుంది. కొన్నిచోట్ల నేతల చేరికలు పార్టీలోని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. నల్గొండ  జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేములు వీరేశం, కోదాడ బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి కూడా  కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం  సిద్దం చేసుకుంటున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. 

మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. 

అయితే వేముల వీరేశం, శశిధర్ రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దం చేసుకుంటుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గుర్రుగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వీరేశం, శశిధర్ రెడ్డిల చేరికపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ వ్యుహాకర్త సునీల్ కనుగోలు చెబితే ఎవరినైనా చేర్చుకోవడమేనని ప్రశ్నిస్తున్నారు. 

ఈ పరిణామాల గురించి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ఇరువురు నేతలు సన్నిహితుల చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నల్గొండ రాజకీయాలతో పొంగులేటికి ఏం పని అని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. దీంతో టీ కాంగ్రెస్‌లో చేరికల అంశం హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. 

టికెట్ వస్తుందనే ఆశ లేకపోవడంతోనే కాంగ్రెస్ వైపు వీరేశం..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వేముల వీరేశం.. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య(కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి ఆశీస్సులతోనే) చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత లింగయ్య కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో అధికార బీఆర్ఎస్‌లో వేముల వీరేశం వర్సెస్ లింగయ్య విభేదాలు పలు సందర్భాల్లో బయటపడుతున్నాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే వీరేశం.. తనకు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదనే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా  సమాచారం. అయితే ఈ పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా  తెలుస్తోంది. 

మరోవైపు కోదాడ  నుంచి ఉత్తమ్ సతీమణి  పద్మావతి  బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్నారు. అదే నియోజకవర్గానికి చెందిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రానున్నారనే వార్తలపై ఉత్తమ్ ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని  కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్