హైదరాబాద్ నార్సింగిలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి....

Published : Jun 21, 2023, 10:15 AM IST
హైదరాబాద్ నార్సింగిలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి....

సారాంశం

నార్సింగిలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలిమీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. 

హైదరాబాద్ : హైదరాబాద్ నార్సింగిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు ఈ ఘటన నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గర జరిగింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. విభేదాలు రావడంతో మాట్లాడుదామని పిలిపించాడు. అతని అభ్యర్థన మేరకు నార్సింగి గ్రిల్ ట్రీ హోటల్ దగ్గరికి రాగా, అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో ఆమె మీద కత్తితో దాడిచేశాడా ఉన్మాది. దీంతో ఆమె మెడ, చేతులు లపై గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?